వైసీపీకి చెక్ పెట్టే దిశగా పవన్ భారీ ప్లాన్

వైసీపీకి చెక్ పెట్టే దిశగా పవన్ భారీ ప్లాన్

0
73

గెలిస్తే మహా అయితే నలుగురిని పరిచయం చేస్తుంది అదే ఒక్కసారి ఓడి చూడు సమాజం అంటే ఏంటో నీకు తెలుస్తుందన్న డైలాగ్ ను ఇప్పుడు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాన్ భాగా ఫాలో అవుతున్నారాట.

ప్రజలకు జనసేన పార్టీపై నమ్మకాన్ని పెంచాలని చూస్తున్నారట. అందుకు తగిన ప్రణాళికలను కూడా సిద్దం చేసుకుంటున్నారట. నిజానికి పవన్ పార్టీ ప్రకటించిన రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అలానే ఉంది.

అందుకే ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోరంగా ఓటమి చెందారు… అయితే పవన్ మాత్రం గట్టినమ్మంకతో ఉన్నారట. ప్రజలు తనను ఎప్పటికైనా విశ్వసిస్తారని తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనుకుంటున్నారట. అందుకే ఆయన రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, ఆప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ ప్రాంతంలో పర్యటించనున్నారని తెలుస్తోంది.