మరో పోరాటానికి సిద్దమైన పవన్

మరో పోరాటానికి సిద్దమైన పవన్

0
102

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరో పోరాటానిరి సిద్దమయ్యారు అందుకు సంబంధించిన డేట్లు కూడా ప్రకటించారు… ఈమేరకు ట్వీట్ కూడా చేసింది… నిర్మాణ రంగంపై ఆధారపడ్డ వారికి.. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లభించక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న అంశంపై కార్మికులకు మద్దతుగా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో భారీ ర్యాలీ చేయాలని నిర్ణయంతీసుకున్నారని పేర్కొంది.. అందుకుసంబంధించి డేట్లు కూడా ప్రకటించారు… నవంబర్ 3 లేదా 4న విశాఖలో జనసేన భారీ పాదయాత్ర. అలాగే భవన నిర్మాణ కార్మికుల బాధలపై గళమెత్తనున్న జనసేనాని. ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది కోసం లాంగ్ మార్చ్ నిర్వహించనున్నారు..

నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలు ప్రజా ధనాన్ని స్వాహా చేశారని జనసేనపార్టీ అభిప్రాయ పడింది… ఈ రెండు పార్టీలు దొందు దొందే అని జనసేన పేర్కొంది…

చంద్రబాబు నాయుడు నాయుడు తన కుటుంబ విలాసాలకు ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తి గత కేసుల విచారణకు హాజరు అవ్వడంకోసం నెలకు సుమారు రెండుకోట్లు స్వాహా చేస్తున్నారని జనసేన ఆరోపించింది..