దిల్లీలో వైసీపీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కల్యాణ్

దిల్లీలో వైసీపీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కల్యాణ్

0
84

అమరావతి రాజధాని రైతుల కోసం పవన్ కల్యాణ్ హస్తిన వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆయన అక్కడ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.. అసలు ఏపీలో వైసీపీ సర్కారు కేంద్రంతో చర్చించి పాలన వికేంద్రీకరణ రాజధాని మార్పుచేస్తోందా అని ప్రశ్నించారు. దీనికి బీజేపీ పెద్దలు మాత్రం తమ అనుమతి లేదు అని తెలియచేశారట. దీనిని పవన్ కల్యాణ్ తెలియచేశారు.

కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్న వైసీపీ వాదనలో నిజం లేదని.. ఈ విషయాన్ని కేంద్రం తనకు స్పష్టం చేసిందని పవన్ చెప్పారు. ఇందులో ప్రధాని, హోం మంత్రి పాత్ర లేదని ఆయన తెలిపారు. అయితే ఇక్కడ వైసీపీ నేతలు మాత్రం కేంద్రం అనుమతి తీసుకున్నాము అని చెబుతున్నారు..అమరావతి రైతులకు అండగా ఉంటామని జనసేనాని హామీ ఇచ్చారు. కేంద్రం అనుమతితోనే వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చామన్న వైసీపీ అవాస్తవ ప్రచారాన్ని జనసేన, బీజేపీ ప్రతినిధులు తిప్పికొట్టాలని పవన్ పిలుపునిచ్చారు.

దీంతో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనుకునేదానిపై ఇప్పుడు బీజేపీ జనసేన రెండూ కూడా కలిసి పోరాడాలి అని అనుకుంటున్నాయి…అసలు తమ దగ్గరకు ఈ ప్రతిపాదన రాలేదు అని ఏపీ బీజేపీ కో-ఇంచార్జ్ సునీల్ దియోధర్ కూడా తెలిపారు. అయితే కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.