ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలతో ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్నారు. అయితే కొన్ని ప్రజలకు కూడా ఇబ్బంది కరంగా మారుతున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి…తాజాగా ఇసుక కొరత మాత్రం ఏపీలో జగన్ సర్కారుకి మెడపై కత్తిపెట్టినట్లు అయింది ..ఇటు రాష్ట్రంలో అందరూ కూడా వైసీపీకి కౌంటర్లు ఇచ్చారు. ఇక తాజాగా ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విధ్య అమలు చేస్తాము అని చెప్పారు జగన్.
దీనిపై మళ్లీ విమర్శలు ఆరోపణలు రావడంతో ఈ జీవో ని సవరించి 1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం ని తోలి విడతలో ప్రవేశపెట్టనుంది..దీనిపై పవన్ చంద్రబాబు టీడీపీ జనసేన బీజేపీ ఎన్నో విమర్శలు చేశాయి. తాజాగా పవన్ కల్యాణ్ ఇసుక పోరాటం తర్వాత దీనిపై మరింత ఫోకస్ చేసి జగన్ని టార్గెట్ చేశారు. అయితే మన ఉప రాష్ట్రపతి గౌరవనీయులైన వెంకయ్య నాయుడు ఆర్టికల్ పైన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఆయన ఓ ఆర్టికల్ రాశారు.
గౌరవనీయులైన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఆర్టికల్ వైసీపీ ప్రభుత్వానికి పెద్ద కనువిప్పుగా వుంది అంటూ మరొకసారి జగన్ ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసారు. దీనిపై వైసీపీ కూడా ఆరోపణలు చేస్తోంది, కావాలనే జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని జనసేన టీడీపీ కంకణం కట్టుకున్నాయి అని అంటున్నారు.