సర్కార్ కు షాక్ …పవన్ సంచలన నిర్ణయం

సర్కార్ కు షాక్ ...పవన్ సంచలన నిర్ణయం

0
159

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు అండగా ఉండాలని జనసేనాని నిర్ణయించుకుంది… కొద్దికాలంగా టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు..

వీరి నిరసనలకు జనసేనాని మద్దతు తెలుపుతూనే వస్తుంది… ఇప్పటికే కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన పవన్ తాజాగా ఆర్టీసీ కార్మికుల యూనియన్ల జేఏసీ నిర్ణయం మేరకు ఈ నెల 19న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు పవన్.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జనసేన పార్టీసైనికులు కార్మికుల బంద్ కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు… ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడకుండా బంద్ ను ప్రశాంతంగా విజయవంతం చేయాలని పవన్ పిలుపునిచ్చారు…