కొద్దికాలంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై విమర్శలు దాడి చేస్తున్నారు… ఇటీవలే జగన్ వందరోజుల పరిపాలన పూర్తి అయిన కాటినుంచి తాజాగా గ్రామ సచివలాయ పరీక్షా పేపర్ లీక్ వరకు పవన్ ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.
కానీ ఆయన ఆరోపణలకు వైసీపీ సర్కార్ ఖండించకుంది… దీంతో పవన్ ఈ సారి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విమర్శలు చేశారు. ఎన్నోఆశలతో ఉద్యోగం సంపాదించాలని లక్షలాదిమంది నిరుద్యోగులు గ్రామసచివలాయ పరీక్షలు రాశారని కానీ అధికార పార్టీ వెనుక తిరిగేవాళ్లకే ఉద్యోగాలు వచ్చాయని పవన్ మండిపడ్డారు…
దీనిపై వెంటనే ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు… పారదర్శకతతో నిష్పక్షపాతంతో పరీక్షలు నిర్వహించామని డైలాగులు చెప్పి వైసీసీ సర్కార్ భారీ కుంభకోణానికి తెర లేపిందని పవన్ ట్వీట్ చేశారు.