గాజువాక నుంచి తట్టా బుట్టా సర్దేసిన పవన్… నెక్ట్స్ పోటీ అక్కడ నుంచే

గాజువాక నుంచి తట్టా బుట్టా సర్దేసిన పవన్... నెక్ట్స్ పోటీ అక్కడ నుంచే

0
106

ఇరు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ప్లేస్ మార్చనున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత మొదటి సారి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల ముందు పవన్ రాజకీయ అరంగేట్రం చేసి సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు…

అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి నిలబడలేదు… తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచి ఆపార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించింది… ఆ తర్వాత టీడీపీతో చెడి విడాకులు తీసుకుంది…. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ వామపక్షాలతో పొత్తుపెట్టుకుని తొలిసారి బరిలోకి దిగారు… గాజువాక అలాగే భీమవరం సెగ్మెంట్ లలో పోటీ చేశారు… కానీ ఫ్యాన్ గ్లాస్ ముందు నిలబడలేకపోయింది…

ఫ్యాన్ గాలికి గ్లాస్ పగిలి నాలుగు ముక్కలు అయిన సంగతి తెలిసిందే… అయితే తాజా విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ వచ్చే ఎన్నికల్లో ప్లేస్ మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు… గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న నియోజకవర్గంలో దిగుతారని వార్తలు వస్తున్నాయి… అలా అయితే ఈ సారి పవన్ కచ్చితంగా గెలుస్తారని భావిస్తున్నారు జనసైనికులు… నరసాపురం పవన్ సొంత నియోజకవర్గం… మొగల్తూరు గ్రామం నరసాపురం అసెంబ్లీ పరిధిలోనే ఉంటుంది… ఇక అక్కడ నుంచి పోటీ చేస్తే విజయం ఖాయం అని భావిస్తున్నారు…