పవన్ ట్వీట్

పవన్ ట్వీట్

0
132
Pawan Kalyan

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ అనే జవాను వీరమరణం పొందారు… దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు ఈమేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు… పెద్దపల్లి జిల్లా నాగారం గ్రామానిక చెందిన సాలిగం శ్రీనివాస్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అని అన్నారు…

ఇటీవలే చైనా సరిహద్దులో జరిగిన పోరాటంలో సంతోష్ బాబు అనే వీరున్ని కోల్పోయిన కొద్దిరోజుల్లోనే తెలంగాణకు చెందిన మరో సైనికుడు వీర మరణంపొందారని అన్నారు… శ్రీనివాస్ కుటుంబసభ్యలుకు పవన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు… ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్న విధంగానే శ్రీనివస్ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు పవన్..