వైసీపీ తలపులు తట్టి వెనుదిరిగిన పవన్ ఎమ్మెల్యే….

వైసీపీ తలపులు తట్టి వెనుదిరిగిన పవన్ ఎమ్మెల్యే....

0
121

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ తలపులను తట్టి వెంటనే వెనుదిగిగారు… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే రైతు భరోసా పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే అందులో భాగంగా రాజోలులో కూడా అధికారులు రైతుభరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు..

ప్రోటో కాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే రాపాకను అలాగే వైసీపీ ఇంచార్జ్ బొంతు రామేశ్వరరావు ను కార్యకర్తలను ఆహ్వానించారు… అయితే ఈ కార్యక్రమానికి స్థానికి ఎమ్మెల్యే హాజరు కాకముందే అధికారులు బొంతు రామేశ్వరరావుతో ప్రారంభించారు…ఇక అధికారులు చెప్పిన సమయానికి అక్కడికి చేరుకున్న రాపాక అధికారులపై హర్ అయ్యారు…

ప్రోటో కాల్ ప్రకాం స్థానిక ఎమ్మెల్యే ఏ కార్యక్రమం అయిన ప్రారంభించాలని తెలిసికూడా వైసీపీ నేతలు ఎలా ప్రారంభిస్తారని ఆయన ఫైర్ అయ్యరు. ప్రజా మద్దతుతో గెలిచినా కూడా తన కంటే వైసీపీ నాయకులకు అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దీనిపై తాను కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు…