పవన్ కంచుకోటలో… సీఎం జగన్ పార్టీలో వార్…

పవన్ కంచుకోటలో... సీఎం జగన్ పార్టీలో వార్...

0
76
Rajolu

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రోజు రోజుకు భగ్గుమంటున్నాయి… ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో వర్గ పోరు ఎక్కువ అవుతోంది… తాజాగా జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి…

మాజీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావుకి పెదపాటి అమ్మాజీ వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం నెలకోంది… తాజాగా బొంతు రాజేశ్వర వర్గం తాటిపాక సెంటర్ లో సమావేశం అయి తిరిగి ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని వైఎస్సార్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు…

పార్టీ ఓటమి కోసం పనిచేస్తున్న వారికి పెదపాటి అమ్మాజీ పదవులు కట్టబెడుతున్నారని రాజేశ్వరరావు వర్గీలు ఆరోపించారు.. తిరిగి బొంతుకు రాజోలు పార్టీ బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు..

ఈ విషయంపై పార్టీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో ఈ వర్గపోరు ఎక్కువ అవుతుందని అంటున్నారు… అంతేకాదు ఈ ఎఫెక్ట్ స్థానికి సంస్థలపై కూడా పడె అవకాశాలు ఉన్నాయని అంటున్నారు…