పవన్ కీలక ప్రకటన ఇక వైసీపీకి డేంజరేనా

పవన్ కీలక ప్రకటన ఇక వైసీపీకి డేంజరేనా

0
95

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అగ్రనేతలతో భేటీకి ప్లాన్ చేసుకున్నారు.. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో నేడు బీజేపీ నేత జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మొన్న ఢిల్లీ వెళ్లిన పవన్ ముందుగా ఆర్ఎస్ఎస్ నేతలను కలిశారు. తర్వాత బీజేపీ ప్రధాన కార్యదర్శి సంతోష్ తోను, ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతోనూ భేటీ అయ్యారు.

అయితే గతంలో తాను బీజేపీకి దూరంగా లేను అని చెప్పిన పవన్, తాజాగా బీజేపీకి దగ్గర అవుతున్నారు అనేది తేలిపోయింది, అయితే ఏపీలో రాజధాని అంశం పై జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు రాజధాని మార్పు గురించి కేంద్ర పెద్దలని కలిసి వారితో చర్చిస్తున్నారు.. మూడు రాజధానుల అంశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అమరావతికి భూములిచ్చిన రైతుల ఆందోళనలు ఈ అంశాలపై పవన్ చర్చించినట్లు తెలుస్తోంది.

ఏపీ ఆర్ధిక పరిస్దితి అలాగే వేల ఎకరాలు ఇచ్చిన రైతులు నష్టపోతారని చర్చిస్తున్నారు.. ఈ విషయంలో కేంద్రం స్పందించాలి అని కోరుతున్నారు.
రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలన్న దానిపై కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఇరుపార్టీల నేతలు ప్రాథమిక చర్చలు జరిపారని జనసేన వర్గాల…