పవన్ కు బీజేపీ కీలక పదవి ఆఫర్…

పవన్ కు బీజేపీ కీలక పదవి ఆఫర్...

0
134

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్రీలాన్సర్ గా ప్రవర్తిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

వ్యక్తిత్వం, నిబద్దత అనే పదాలకు పవన్ కళ్యాణ్ కు డిక్షనరీలో చోటు లేదని ఆయన ఆరోపించారు.. ప్రత్యేక హోదా పై బీజేపీ నుంచి ఎటువంటి హామీ లభించిందో ఆయన ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు…

అధికారం కోసం తహతహలాడుతున్నారని పవన్ కు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఇస్తారనే సమాచారం ఉందని అన్నారు… పవన్ కెమెరా ముందుకంటే ప్రజలముందు బాగా నటిస్తున్నారని అమర్నాథ్ ఆరోపించారు… కాగా తాజాగా పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే…