పవన్ కు సీఎం అవ్వాలనే కోరిక ఇలా నెరవేరనుంది

పవన్ కు సీఎం అవ్వాలనే కోరిక ఇలా నెరవేరనుంది

0
107

ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో తాజాగా పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే…ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు… ఈ చిత్రం తర్వాత పవన్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఒక సినిమా తీయనున్నాడని టాక్ …ఈ చిత్రం ద్వారా పవన్ సిఎం అవ్వాలన్న కోరిక పూరి తీర్చనున్నాడని టాక్…

సీఎం అయ్యే పాత్రనే పవన్ కోసం పూరి తీర్చి దిద్దాడట… అప్పట్లో మహేష్ బాబుతో జనగణమన ప్రకటించిన పూరి ఆ సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు… ఇప్పుడు ఇదే కథను పవన్ తో తీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది…

కాగా పవన్ కళ్యాణ్ గతంలో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు.. జనసేన పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకుని ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు…

ఆ తర్వాత ఆ పార్టీలో చెడి 2019 ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు… ఆ ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓటమి చెందారు… ఇప్పుడు బీజేపీతో జతకట్టారు…