జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు… చంద్రబాబు నాయుడు స్ట్కిప్ట్ ను పవన్ చదువుతున్నారని ఆయన మండిపడ్డారు…
తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో లింగమనేని రమేష్ తనకు భూమినించారని ఇప్పుడు ఆ భూమి రేట్లు పడిపోతుందని పవన్ ఆందోళన చెందుతున్నారని ఆయన ఆరోపించారు…
చంద్రబాబు నాయుడు పేయిడ్ ఆర్టిస్ట్ లలో పవన్ కూడా తోడయ్యారని సుధాకర్ బాబు ఆరోపించారు…. అలాగే ఏపీ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు… ప్రధాని మోడీ చంద్రబాబు నాయుడు దొంగా అని విమర్శలు చేస్తుంటే ఏపీ బీజేపీ నాయకులు మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సుధాకర్ బాబు ఆరోపించారు…