పవన్ పై కేటీఆర్ పంచ్

పవన్ పై కేటీఆర్ పంచ్

0
86

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచ్ లు వేశారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నెలకొన్న రాజకీయాలపై స్పందించారు…

ఏపీలో మూడు రాజధానులు చేస్తామంటే ఆందోళనలు చేస్తున్నారని అన్నారు.. గతంలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల ఏర్పాటే చేస్తే చిన్న ఆందోళలన కూడా జరుగలేదని అన్నారు… ఏపీలో ఇంత ఆందోళన వ్యతిరేకత ఎందుకు వస్తోందో ఆలోచించాలని అన్నారు…

అలాగే జనసేన పార్టీపై కూడా సెటైర్లు వేశారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ అంతర్జాతీయ పార్టీగా మరోచ్చని సైటైర్లు వేశారు… పవన్ కళ్యాణ్ ఏం చేస్తే తమకేం సంబంధం అని వ్యాఖ్యానించారు… కాగా తాజాగా జనసేన పార్టీ బీజేపీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే… ఇక నుంచి రాష్ట్ర రాజకీయాల గురించి కలిసి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు…