ప‌వ‌న్ పై విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ – నాగ‌బాబు మ‌రో దారుణ‌మైన ట్వీట్

ప‌వ‌న్ పై విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ - నాగ‌బాబు మ‌రో దారుణ‌మైన ట్వీట్

0
121

క‌రోనా స‌మ‌యంలో కూడా ఏపీలో రాజ‌కీయాలు హీట్ పుట్టిస్తున్నాయి, తాజాగా వైసీపీ ఎంపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై చేసిన ట్వీట్ తో ఇప్పుడు జ‌న‌సేన వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.

కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్… ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని నేను లేస్తే మనిషిని కాదు అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా? అని ట్వీట్ చేశారు విజ‌య‌సాయిరెడ్డి.

ఈ ట్వీట్ పై జనసేన నేత నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవును విజయసాయి నువ్వు చెప్పింది కరెక్ట్ …ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి మాకు తెలుసు. మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి.. పవన్‌తో దోస్తీకి రెడి అన్న మీ గుంట నక్కరాజకీయలు నాకు గుర్తున్నాయి అంటూ స‌టైర్ వేశారు.