జగన్ టార్గెట్… ఇదే పవన్ కొత్త తరహా రాజకీయం

జగన్ టార్గెట్... ఇదే పవన్ కొత్త తరహా రాజకీయం

0
88

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వందరోజుల పరిపాలన ఇటీవలే పూర్తి అయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటికే తమ ఘళాన్ని విప్పారు. ఇక ఇదే క్రమంలో జనసేనపార్టీ అధినే పవన్ కుడా తన ఘళాన్ని విప్పారు…

జగన్ పాలనకు సంబంధించిన ఒక నివేదికను కూడా విడుదల చేశారు… ఈ నివేదికలో పవన్ మొత్తం తొమ్మిది అంశాలపై ప్రస్తావించారు.. జగన్ పాలన ప్రణాళికా బద్దంగా ఉందని అన్నారు.. సీజన్ లో వచ్చే డెంగి మలేరియా వంటి వ్యాధుల నివారణలో ప్రభుత్వం వాటికి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందని పవన్ మండిపడ్డారు..

గతంలో టీడీపీ నాయకులు ఏ తప్పు అయితే చేసి ప్రతిపక్షంలో చేరారో ఇప్పుడు అదే తప్పు వైసీపీ అధిష్టానం చేస్తోందని పవన్ అరోపించారు. వైసీపీ కార్యకర్తలను వచ్చే ఎన్నికల్లో సన్నద్దం చేయడానికే గ్రామ వాలటీర్లను నియమించిందని అన్నారు. ఇందులో అందరు వైసీపీకిచేందిన వాలంటీర్లే ఉన్నారని అన్నారు పవన్.