పూనమ్ ను గర్భవతిని చేసిన పవన్ కళ్యాణ్..వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

0
119

గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మాటల యుద్దానికి  ఆజ్యం పోసింది మాత్రం రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంటే. ఆ ఫంక్షన్ లో ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు ఒకరు తర్వాత ఒకరు పవన్ పై మాటల దాడి చేశారు. పవన్ కళ్యాణ్ కూడా వాటికీ ధీటుగా బదులిచ్చాడు.

అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ పంజాబీ హీరోయిన్ ను మోసం చేసి గర్భవతిని చేశాడు. అంతేకాదు అబార్షన్ కూడా చేయించాడంటూ మండిపడ్డారు. దానితో ఆగ్రహించిన పవన్ ఫాన్స్ పోసాని ఇంటిపై దాడి కూడా చేశారు. ఇక ఆ వివాదం సద్దుమణిగింది అనుకునే లోపే మరో వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ కు బయట తెలిసినంత వరకు ముగ్గురు భార్యలే కానీ తెలియకుండా ఎంతమంది ఉన్నారో అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అంతేకాదు పంజాబీ అమ్మాయి విషయం మళ్లీ తెరపైకి తెచ్చారు. పంజాబీ నటి పూనమ్ కౌర్ ను పవన్ కళ్యాణ్ ప్రేమించి గర్భవతిని చేశాడు. అంతేకాదు అబార్షన్ కూడా చేయించి రూ.5 కోట్లు ఇచ్చి నోరు మూయించారని మండిపడ్డారు. నన్ను సన్నాసి అన్న పవన్ కల్యాణే సన్నాసిన్నర సన్నాసి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.