రాజకీయ సమావేశాల్లో ఆగ్రహం ఆవేశం ఎంత వచ్చినా నిలుపుకోవాలి.. ఇష్టం వచ్చినట్లు ప్రసంగాలు చేస్తూ కామెంట్లు చేస్తే చివరకు పార్టీకి నేతలకు చెడ్డపేరు తీసుకువస్తాయి.. తాజాగా జనసేన నుంచి వచ్చిన కామెంట్ ఏపీలో చర్చనీయాంశమైంది.. యువత తన వెంట ఉంటారు అని చెప్పే పవన్ కల్యాణ్ , తన పార్టీ మీటింగుల విషయంలో నాయకులని కంట్రోల్ చేయడం లేదు అంటున్నారు మేధావి వర్గం.
తాజాగా జనసేన నాయకుడు సాకే పనవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. హింసా రాజకీయాలను జనసేన ప్రోత్సహిస్తోందని ఇప్పటికే వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం నేతలు స్పందించారు. ఆపార్టీనేత చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు అన్నారు.
రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి ఎలాంటి హాని జరిగినా ఊరుకోమని, పవన్ కల్యాణ్ తల తీసేందుకు కూడా వెనుకాడమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో ఏ ఒక్క రెడ్డికి హాని జరిగినా పవన్ కల్యాణ్ ఎముకలు విరిచేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాకే పవన్ కుమార్ నిన్న జరిగిన సభలో ఏ రెడ్డి వచ్చినా తల నరుకుతాం అని అన్నారు ..తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి ఈ మాటలు అనడంతో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి, పవన్ కల్యాణ్ దీనిని ఖండించలేదు