పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం – లిస్ట్ విడుదల

పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం - లిస్ట్ విడుదల

0
91

ఏపీలో జనసేన కేడర్ లేదు అని, అందుకే ఆ పార్టీ అలా అస్తవ్యస్ధంగా మారిపోయింది అని సొంత పార్టీ అభిమానులు భావిస్తున్నారు.. అందుకే ఈ ఎన్నికల్లో తమకు ఓటమి వచ్చింది అని విచారిస్తున్నారు, ఈ సమయంలో పవన్ కూడా పార్టీ పై మరింత ఫోకస్ చేశారు. తాజాగా రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను నియమించారు.

ఈ కొత్త లిస్ట్ ని జనసేన పార్టీ ఓ ప్రకటనగా విడుదల చేసింది. ఓ సారి పవన్ కల్యాన్ పార్టీలో ఎవరెవరికి అవకాశం ఇచ్చారు అనేది చూద్దాం.ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని నియమించారు పవన్ కల్యాణ్ , అయితే పార్టీ బలోపేతానికి ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఈ కమిటీలో టి.శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుందని తెలిపింది.దీంతో ఈ ప్రాంత జనసైనికులు ఆనందంలో ఉన్నారు.