ఇప్పుడు అంతా ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు ప్రతీ ఒక్కరు, దేనికి అయినా అంతా ఆన్ లైన్ పేమెంట్లతో కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్నాయి. తాజాగా పేటీఎం వాడకం కూడా బాగా పెరిగింది, ఇప్పుడు ఏ చెల్లింపులు అయినా పేటీఎంతో సింపుల్ గా చేస్తున్నారు.
ఈ సమయంలో పేటీఎం కంపెనీ వ్యాపారులకి తీపికబురు అందించింది.పేటీఎంను ఉపయోగిస్తున్న వ్యాపారులు తమకు కస్టమర్లు చెల్లించే మొత్తాలకు గాను పేటీఎం ఇప్పటి వరకు ఒక రోజు వచ్చే పేమెంట్లను మరుసటి రోజు సెటిల్మెంట్ చేస్తూ వచ్చింది. అంటే ఈరోజు పేమెంట్ రేపు పే చేసేది, సో కాని ఇప్పుడు ఏ రోజు పేమెంట్ ఆరోజు చేయనుంది.
దీని వల్ల వ్యాపారులకి వెంటనే నగదు సెటిల్ అవుతుంది.. వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినప్పుడు పేమెంట్లను సెటిల్ చేసుకోవచ్చు. దీని వల్ల చిరు వ్యాపారులకి చాలా మేలు, ఏరోజు నగదు ఆరోజు జమ అవుతుంది. ఇక ఫెస్టివల్ సేల్ స్టార్ట్ అవ్వబోతోంది, ఈ సమయంలో ఈ నిర్ణయం వ్యాపారులకి మరింత మేలు చేస్తుంది అంటున్నారు..వ్యాపారులు తమ పేమెంట్లను కనీసం రూ.50 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఒక ట్రాన్స్ఫర్కు సెటిల్ చేసుకోవచ్చు. ఇక మీరు పెమెంట్లని మూడు సార్లు రోజుకి చేసుకోవచ్చు.