ఈ లాక్ డౌన్ మన దేశంలో 40 రోజులుగా కొనసాగుతోంది, ఈ సమయంలో ఎవరైనా బయటకు వచ్చిన సమయంలో సామాజిక దూరం పాటించాలి మాస్క్ ధరించాలి, అయితే ఆరెంజ్ గ్రీన్ జోన్లో కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం, దీంతో చాలా మంది బయటకు వస్తున్నారు సరైన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలి అని హెచ్చరిస్తున్నారు పోలీసులు వైద్యులు.
అయితే లాక్ డౌన్ తో ఆగిపోయిన పెళ్లిళ్లు ఇప్పుడు సడలింపులు రావడంతో చేసుకోవాలి అని అనుకున్నా, గతంలో 20 మంది మాత్రమే పెళ్లికి అనుమతి ఇచ్చిన కేంద్రం ఇప్పుడు 50 మందికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అంతేకాదు పెళ్లి వేడుకలకు 50 మంది, కన్నా ఎక్కువ సంఖ్యలో జనం ఉండరాదు అని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవా తెలిపారు.
మొన్నటి వరకూ చాలా మంది వివాహల విషయంలో కేంద్రం ఏమైనా ప్రకటన చేస్తుందా అని చూశారు, కాని సడలింపులు అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి కేంద్రం రెడీగా లేదు మళ్లీ పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లకు జనాలు వస్తే ఇబ్బంది అని భావించి కేవలం 50 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు.