పించన్లు రాలేదా మీరు అర్హులా అయితే ఇలా చేయండి కొత్త కార్డు వస్తుంది

పించన్లు రాలేదా మీరు అర్హులా అయితే ఇలా చేయండి కొత్త కార్డు వస్తుంది

0
114

ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు పథకాలకు శ్రీకారం చుట్టారు.. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, పించన్ కార్డులు , వసతి దీవెన కార్డులు కూడా అందిస్తున్నారు…ఫిబ్రవరిలో 54లక్షల 68వేల 322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది, వీరు అందరికి కొత్తగా పించన్ కార్డులు అందిస్తారు.

20వ తేదీ వరకు 4 రోజుల పాటు వాలంటీర్ల ద్వారా కొత్త ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేయనున్నారు… పింఛను పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు ఇస్తారు.. దీని ద్వారా వాలంటీర్ ప్రతీనెలా పించన్లు ఇస్తారు. ఇక మీరు అర్హులు అయినా మీకు కొత్త పించన్ కార్డు రాకపోతే మరోసారి అప్లై చేసుకోవచ్చు అని అధికారులు చెబుతున్నారు.

ఒక వేళ మళ్లీ అప్లై చేసుకుంటే మీరు అర్హులు అయితే మార్చి 1వ తేదీన గుర్తింపు కార్డులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు.. చాలా మంది పించన్లు తీసేశారు అని అంటున్నారు, అందుకే మరోసారి రీ సర్వే జరిపి, అర్హులైన వారికి పించన్లు అందిస్తున్నారు. కొత్తగా 6లక్షల 14వేల 244 మందికి వైసీపీ సర్కారు కొత్త పించన్లు అందచేసింది. ఈ నెల పించన్ రాకపోతే అర్హులు అయితే రెండు నెలల పించన్ కలిపి మార్చిలో ఇవ్వనున్నారు.