ఓపక్క కరోనా వచ్చి జనాలు మరణిస్తుంటే కొందరిలో ఏమాత్రం మార్పులేదు, ఓ పక్క చాలా మంది చావు బతుకుల మధ్య ఉంటున్నారు, వీటిని చూసి అయినా ప్రజల్లో మార్పు రావాలి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి.. కాని కొందరు పట్టించుకోవడం లేదు ఇంకా గుంపులు గుంపులు గానే ఉంటున్నారు.
ఇక కొత్త వ్యాపార సంస్ధల ప్రారంభాలు జరిగినా, ఆఫర్లు పెట్టినా గుంపులు వద్దు అని అక్కడ అధికారులు చెబుతున్నారు. కాని వ్యాపారం కోసం కొందరు ఈ గుంపులని ఎంకరేజ్ చేస్తున్నారు, దీని వల్ల ఆ వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తుందో ఆలోచిస్తుంటేనే భయం వేస్తోంది.
తాజాగా చెన్నైలోని టీ.నగర్ లో కుమరన్ సిల్క్ షాప్ కస్టమర్లతో పోటెత్తింది. దసరా పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా ఈ షాపింగ్ మాల్ కి వచ్చిన వినియోగదారులతో ఇది కిక్కిరిసిపోయింది. కొందరు మాస్క్ ధరించలేదు, పెద్ద ఎత్తున జనాలు లోపలికి వచ్చారు,
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, కరోనా వైరస్ గైడ్ లైన్స్ పాటించనందుకు ఈ షాపును మున్సిపల్ అధికారులు సీల్ చేసేశారు.
మరి ఈ వీడియో చూడండి జనం ఎలా ఉన్నారో.
This video of a big crowd of saree shoppers inside Chennai’s famous Kumaran Silks in T.Nagar has forced a shutdown for violation of Covid19 rules. pic.twitter.com/SvrdAlKJZV
— Shiv Aroor (@ShivAroor) October 20, 2020