ప్రజలకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

ప్రజలకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

0
78

మన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది, ఇప్పటికే దేశంలో ఎక్కడి వారు అక్కడే ఉన్నారు, అసలు ఎవరూ బయటకు అడుగు వేయడం లేదు, లాక్ డౌన్ బాగానే ఫాలో అవుతున్నారు, అయితే ఏప్రిల్ 14 తో ఈ లాక్ డౌన్ పూర్తి అవుతుందని దీనిని ఇంకా పొడిగించే ఆలోచ లేదు అని కేంద్రం నుంచి కాస్త వార్తలు వచ్చాయి.

దీంతో ప్రజలు కూడా ఏ్రప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ అని భావిస్తున్నారు, మరోసారి పొడిగింపు ఉండదు అంటున్నారు, అంతేకాదు ఈ సమయంలో పౌర విమానయాన సంస్థలు 15వ తేదీ ప్రయాణాలకు బుకింగ్స్ ప్రారంభించాయి. ఇలా చేయడంతో నమ్మకం కూడా జనాలకు వచ్చింది.

15వ తేదీ నుంచి రైళ్లను నడిపించేందుకు సిద్ధమని చెప్పిన ఇండియన్ రైల్వేస్, ఇప్పటికే బుకింగ్స్ ను ప్రారంభించాయి. తాజాగా , ఏపీఎస్ ఆర్టీసీ సైతం 15 నుంచి బుకింగ్స్ ను ప్రారంభించింది. ఓపీఆర్ఎస్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక ఏసీ బస్ లు కాకుండా సాధారణ అన్నీ బస్సులు బుకింగ్స్ జరుగుతున్నాయి.