రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు వదలడం లేదు నాలుగు రోజులు కురిసి శనిఆదివారం కాస్త గ్యాప్ ఇచ్చాయి అంతే మళ్లీ నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి, అయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వలన 24 గంటల నుంచి 48 గంటలు భారీ వర్షాలు కురుస్తాయి.
ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు చాలా చోట్ల, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే 19 మరియు 20 తేదిలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇప్పటికే పలు కాలనీలు ఏరియాలో నీటిలో ఉన్నాయి, మరోసారి వర్షం అనేసరికి జనం వణుకుతున్నారు, అయితే
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు స్దానిక నేతలు.