ఈ వ్యాధి ఉన్నవారు నిద్రలోనే మరణిస్తారట..ఇంతకీ ఆ వ్యాధి ఏంటంటే?

0
107

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర అంతే అవసరం. నిద్రలేకపోతే ఏ పని చేయలేము. దేని మీద ధ్యాస పెట్టలేము. అందుకే నిపుణులు ప్రతిరోజు 8 గంటల నిద్ర తప్పనిసరని సూచించారు. రోజుకు కంటికి సరిపడ నిద్ర ఉంటే మెదడుకు ప్రశాంతత ఉండడమే కాకుండా..అనారోగ్య సమస్యలు దరిచేరవు.

కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు నిద్రలోనే మరణిస్తారు. అందులో ముఖ్యంగా మూర్ఛ వ్యాధి ఉన్నవారు నిద్రలోనే మరణించే అవకాశం ఉంటుందట. మూర్ఛ వ్యాధితో బాధపడేవారు నిద్రపోయేటప్పుడు బోర్లా పడుకోకూడదు. ఎందుకంటే ఒత్తిడి వల్ల ఒక్కోసారి మరణించే అవకాశాలు ఉన్నాయని తాజాగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మంది పిల్లలు ఇలా పడుకోవడం వల్ల మరణించిన సందర్భాలు ఉన్నాయట.

ఇల్లినాయిస్‌లోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జేమ్స్ టావో ప్రకారం.. మూర్ఛ వ్యాధిలో మరణం సాధారణంగా నిద్రలో సంభవిస్తుందని తెలిపారు. ఈ అధ్యయనం కోసం 253 మంది వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేశారు. ఈ అధ్యయనం ప్రకారం 73 శాతం మంది మూర్ఛ వ్యాధిగ్రస్తులు బోర్లా పడుకోవడం వల్ల మరణించినట్లు తెలింది.

మూర్ఛ వచ్చినప్పుడు చేయాల్సిన ప్రాథమిక వైద్యం

మూర్ఛ రోగికి తులసి ఆకురసం సైందవ లవణంతో కలిపి 1 లేదా 2 చుక్కలు వేస్తే స్పృహ వస్తుంది.

పసుపు పొడి పొగ వేసినా మూర్చ నుండి మెలకువ వస్తుంది.

తరచుగా పిల్లల్లో వచ్చే మూర్ఛవ్యాధులకు వస కషాయంతో స్నానం చేయించాలి.

కమ్మగగ్గెర ఆకును ఎండించి చూర్ణం చేసి నస్యంగా వాడితే మూర్ఛ నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.

మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తికి 5 లేక 6 చుక్కల వావిలాకు రసం ముక్కులో వేస్తే ఫలితముంటుంది.

సీతాఫలం ఆకులు నలిపి వాసన చూపితే మూర్ఛ వ్యక్తికి మెలుకువ వస్తుంది.

ఉల్లి రసం ముక్కులో వేసినా మంచి ఫలితం ఉంటుంది.