అందులో పవన్ కు వాట….

అందులో పవన్ కు వాట....

0
87
Pawan Kalyan

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వాటా ఉందా అందుకే ఆయన ఈ విషయంపై పవన్ నోరు విప్పకున్నారా అంటే అవుననే అంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి వెల్లం పల్లి శ్రీనివాస్…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఒక సీఎం కింద పని చేసిన పీఏ ఇంట్లో సుమారు ఆరు రోజులు సోదాలు నిర్వహించడం తాను ఇదే మొదటి సారి చూస్తున్నానని అన్నారు… రెండువేల కోట్లు అక్రమార్జన గుర్తించడం మామూలు విషయం కాదని అన్నారు…

చంద్రబాబు నాయుడు లోకేశ్ అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మంత్రి వెల్లం పల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు…. చంద్రబాబు దోచుకున్న అవినీతి సొమ్ము కేంద్రం కక్కించాలని డిమాండ్ చేశారు… రెండు వేల కోట్ల పై పవన్ ఎందుకు స్పందించకున్నారని ఆరోపించారు… చంద్రబాబు నాయుడు అవినీతిలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఉందని అన్నారు…