రోజు రోజుకి తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు ఒక్కసారిగా పెరిగింది, మార్కెట్లో పెరుగుదల కనిపించింది…హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పైకి పెరిగింది దీంతో ధర రూ.45,510కు చేరింది.
24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.49,650కు చేరింది. ఇక వెండి ధర మాత్రం కాస్త మార్కెట్లో తగ్గుముఖం పట్టింది.. కేజీ వెండి ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.47,550కు చేరింది.
అంతర్జాతీయంగా షేర్లలో ఒత్తిడి జరుగుతోంది, అందుకే మదుపర్లు బంగారం పై పెట్టుబడి పెట్టాలి అని చూస్తున్నారు అందుకే భారీగా పెరుగుతోంది బంగారం ధర. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 1731 డాలర్ల పైకి చేరింది.