పెరిగిన బంగారం వెండి ధరలు – కొత్త రేట్లు ఇవే

పెరిగిన బంగారం వెండి ధరలు - కొత్త రేట్లు ఇవే

0
85

బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది, మే నెల నుంచి చూస్తే ఈ నాలుగు రోజుల్లో మూడు రోజులు పుత్తడి ధర పెరిగింది కాని తగ్గలేదు… పరుగులు పెడుతోంది బంగారం ధర… బంగారం ధర నేడు కూడా మార్కెట్లో పెరిగింది.

 

 

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220

పెరిగింది..రూ.48,000కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.44,000కు చేరింది. ఇక ఈ నాలుగు రోజుల్లో సుమారు 425 రూపాయల పెరుగుదల నమోదు చేసింది.

 

బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా భారీగా పెరిగింది. వెండి ధర కేజీకి రూ.700 పెరుగుదలతో రూ.73,500కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు…వచ్చే రోజుల్లో పుత్తడి 50 వేల మార్క్ దాటవచ్చు అంటున్నారు నిపుణులు.