పెరిగిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

పెరిగిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

0
102

బంగారం ధర ఈ నెలలో భారీగా పెరుగుదల నమోదు చేసింది.. ఏకంగా ఈ నెలలో పది గ్రాములకి 1500 పైనే పెరుగుదల నమోదు చేసింది… అయితే బంగారం ధర ఇక పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు నిపుణులు… కరోనా కేసులు పెరగడంతో ఇప్పుడు చాలా వరకూ బంగారంపైనే పెట్టుబడి పెడుతున్నారు అందరూ.. షేర్ల కంటే బంగారాన్ని పెట్టుబడికి సేఫ్ గా భావిస్తున్నారు.. దీంతో బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి.

 

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.48,170కు ట్రేడ్ అవుతోంది..ఇక అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరుగుదలతో రూ.44,160 కి ట్రేడ్ అవుతోంది.

 

బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా పెరుగుతోంది, కేజి వెండి ధర 300 పెరిగింది, దీంతో వెండి ధర

రూ.73,700కు ట్రేడ్ అవుతోంది, వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు బులియన్ నిపుణులు.