ఆర్టీసీ చార్జీలు పెంచారు కొత్త రేట్లు ఎంతో చూడండి

ఆర్టీసీ చార్జీలు పెంచారు కొత్త రేట్లు ఎంతో చూడండి)

0
103

తెలంగాణ లో ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , తాజాగా ఉద్యోగులు అందరిని కూడా ఉద్యోగాల్లో చేరవచ్చు అని తెలియచేశారు.. దీంతో ఆర్టీసీ కార్మికులు ఆనందంలో ఉన్నారు, అంతేకాకుండా చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలలో వారికి ఒకరికి ఉద్యోగం ఇస్తాము అని తెలియచేశారు.

ఆర్టీసీ కార్మికులను విధుల్లో జాయిన్ కావాలని కోరిన ఆయన, ఆర్టీసీ ఛార్జీలు కిలో మీటర్కు 20 పైసలు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ పెంపు సోమవారం నుంచి అమలవుతుందని వెల్లడించారు.
దీంతో ఇక ఆర్టీసీ చార్జీలు కూడా పెనుభారం అవ్వనున్నాయి.

అయితే ఆర్టీసీ ఉద్యోగులు కూడా రేపటి నుంచి విధుల్లో హజరు అవుతాము అని తెలియచేశారు.. రేపు ఉదయం డ్యూటీల నుంచి బస్సులు నడుపుతారు ఆర్టీసీ కార్మికులు. ఇక ఉద్యోగంలో చేరే ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి షరతులు విధించమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.