బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది. రెండు రోజులుగా చూస్తే పుత్తడి ధర పెరుగుతూనే ఉంది.. ఓ పక్క కరోనా కేసులు పెరుగుతున్న వేళ అందరూ బంగారంపైనే పెట్టుబడి పెడుతున్నారు… భారీగా ధర పెరుగుతోంది..
బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి కూడా పెరిగింది అంతర్జాతీయంగా నాలుగు రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతున్నాయి. అందుకే భారత్ లో కూడా పెరుగుతోంది.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.48,270కు ట్రేడ్ అవుతోంది…10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.90 పెరుగుదలతో రూ.44,250కు చేరింది, ఇక దిగుమతులు పెరిగాయి అమ్మకాలు పెరిగాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.
బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా పెరిగింది.. వెండి ధర కేజీకి రూ.500 పెరుగుదలతో రూ.74,200కు చేరింది. భారీగా వెండి ధర పెరగడం దీనికి ప్రధాన కారణం కొనుగోళ్లు పెరుగుతున్నాయి ఇటు నాణాల తయారీకి కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు, సో వెండి రేటు అందుకే పెరుగుతోంది.. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.