breaking news: తెలంగాణలో విద్యాసంస్థలకు అనుమతి

0
74

కరోనా దేశంలో విజృంభిస్తుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభణతో ఈనెల 30 వరకు తెలంగాణలో స్కూళ్లు బంద్ కాగా ప్రత్యామ్నాయ క్లాసులపై ఓ నిర్ణయానికి వచ్చింది సర్కార్. నేటి నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించనున్నారు. అలాగే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆఫ్ లైన్ తరగతులపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 5 నుండి విద్యాసంస్థలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో తెలంగాణ పాఠశాలల్లో బడి గంట మోగనుంది.

కాగా సంక్రాంతి ముందు నుండే విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. జనవరి 8 నుండి 16వరకు సెలవులు ప్రకటించింది. కాని కరోనా తీవ్రత దృష్ట్యా ఆ తర్వాత జనవరి 30 వరకు పొడగించారు. దీంతో విద్యా సంస్థల క్లోజ్ పై పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీంతో విద్యా సంస్థలు ఓపెన్ చేసి గతంలోనే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ క్లాస్‌లకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.