ఫోన్ పే యూజర్లకు గుడ్ న్యూస్

ఫోన్ పే యూజర్లకు గుడ్ న్యూస్

0
94

పేమెంట్స్ ప్లాట్ఫాం ఫోన్ పే సేవలు కొన్ని గంటలుగా నిలిచిపోయాయి …ఏదైనా బ్యాంకు స్దితి గతులపై న్యూస్ వస్తే ఇలాంటి వ్యాలెట్ సంస్ధలు అప్ డేట్ చేస్తూ ఉంటాయి.. తాజాగా అదే జరిగింది…ఫోన్ పే యూపీఐ భాగస్వామి అయిన యస్ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు మారటోరియం విధించింది, దీంతో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి.

వాటిని కంపెనీ టెక్నికల్ అకౌంట్ టీమ్ పరిష్కరిస్తోంది.. ఇది పూర్తి అయిన తర్వాత వెంటనే ఫోన్ పే సేవలు అందుబాటులోకి వస్తాయి అని చెబుతున్నారు అధికారులు. ఈ సర్వీసు నిలిచిపోవడం పై సంస్థ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పందించారు. తమ బ్యాంకింగ్ భాగస్వామి యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో తమ సేవలు ప్రభావితం అయ్యాయని వివరించారు.

వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరికొన్ని గంటల్లో బ్యాకింగ్ డెబిట్ క్రెడిట్ వాలెట్ సేవలు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు …ఉదయం నుంచి కొన్ని కోట్ల రూపాయల ట్రాన్షక్షన్లు ఫెయిల్ అని వస్తున్నాయి.. లేదా టెక్నికల్ ఎర్రర్ చూపుతున్నాయి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు కస్టమర్లు.