దేశ వ్యాప్తంగా ఉన్న ఫోన్ పే వినియోగ దారులకు ఆ సంస్థ మరో శుభవార్త చెప్పింది… మన దేశంలో కరోన మహమ్మారి రోజు రోజుకు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ వచ్చే నెల 3 వరకు పొడిగించింది… దీంతో ప్రజలు నిత్యవసర వస్తుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు…
చుట్టుపక్కల ఏ షాపు ఓపెన్ చేశారో వారు ఏ వస్తువులను అమ్ముతున్నారో తెలియకుంది… ఈ నేపథ్యంలో పేమెంట్ యాప్ ఫోప్ పే రెండు కొత్త ఆప్షన్లను తీసుకువచ్చింది… దీని ద్వారా మనకు చుట్టుపక్కల షాపుల్లో ఏ వస్తువు ఉందో తెలుసుకోవచ్చు ఆ వస్తువు మనకు కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు లేదంటే మనమే తెచ్చుకోవచ్చ…
ఆర్డర్ డెలివరీ ఉంటే షాపు వ్యక్తి మీకు ఆ వస్తువును ఇచ్చి వెళ్తాడు…ఫోన్ పే యాప్ ఓపెన్ చేయగానే హోం ఆప్షన్ పక్కన స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పై క్లిక్ చేసిన తర్వాత పలు ఆప్షన్లు చూపిస్తుంది. అందులో కరెంట్లీ ఆపరేషనల్ హో డెలివరీ అనే ఆప్షన్లు కూడా కనిపిస్తాయి… వాటిపై క్లిక్ చేస్తే మీకు సమీపంలో ఏ షాపు తెరిచి ఉన్నాయో తెలుస్తుంది.