స‌ర్పంచ్ సీట్లో ఏపీ సీఎం జ‌గ‌న్‌..ఫొటోల‌కు ఫోజులు

0
91

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో పలు పనులను ప్రారంభించారు. వేముల మండ‌లం వేల్పుల గ్రామంలో నూత‌నంగా నిర్మించిన స‌చివాల‌య భ‌వ‌న స‌ముదాయాన్ని ప్రారంభం అనంతరం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స‌చివాల‌యాన్ని ప్రారంభించిన అనంత‌రం భ‌వ‌నంలోని గ‌దుల‌ను ప‌రిశీలించిన జ‌గ‌న్‌ స‌ర్పంచ్‌కు కేటాయించిన గ‌దిలోకి వెళ్లారు.

ఆ గదిలో స‌ర్పంచ్ సీటు వ‌ద్ద‌కు వెళ్లిన జ‌గ‌న్‌.. స‌ర్పంచ్ సీట్లో కూర్చుని ఫొటోల‌కు పోజిచ్చారు. త‌న వెంట వ‌చ్చిన స‌ర్పంచ్ నిర్మ‌ల‌ను కూడా త‌న ప‌క్క‌న నిల‌బెట్టుకుని ఆయ‌న ఫొటోలు దిగారు. ఈ ఫొటోను వైసీపీ సోష‌ల్ మీడియా ఇంచార్జీ, ఏపీ ఫారెస్ట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

“తన పర బేధం లేకుండా సామాన్యుని సైతం అక్కున చేర్చుకునే వ్యక్తిత్వం జగనన్న సొంతం.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మహోన్నత వ్యక్తి, తనను నమ్ముకున్న అతి సామాన్య సర్పంచ్ ని పక్కన పెట్టుకుని ఫోటో దిగడం బహుశా రాజకీయ చరిత్రలోనే ఇప్పటిదాకా చూడని సంఘటన..’ అంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.