పిల్లలకు ఇచ్చే బ్లూ కలర్ ఆధార్ కార్డు మీకు తెలుసా ఇలా అప్లై చేసుకోవాలి

పిల్లలకు ఇచ్చే బ్లూ కలర్ ఆధార్ కార్డు మీకు తెలుసా ఇలా అప్లై చేసుకోవాలి

0
118

ఆధార్ కార్డు ప్రతీ ఒక్కరికి ఉండాల్సిన కార్డు.. అయితే పుట్టిన పిల్లలకు కూడా దీనిని తీసుకోవాలి, కచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ తో పాటు ఈ ఆధార్ కార్డు ఉండాల్సిందే. మరి చిన్న పిల్లలకు ఎలా ఆధార్ తీసుకోవాలి అనేది చూస్తే… మీ పిల్లల వయస్సు ఐదేళ్ల లోపు అయితే తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల్ని తీసుకొని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. తల్లి లేదా తండ్రి తమ ఆధార్ కార్డును చూపించాలి. మీరు కొత్త ఆధార్ మీ పిల్లవాడి కోసం అప్లై చేయాలి దీనికోసం ఫామ్ నింపాలి, ఇక తల్లిలేదా తండ్రి ఆధార్ నకలు అదే జిరాక్స్ ఇవ్వాలి.. అంతేకాదు పిల్లల బర్త్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.

ఇక ఇందులో మీ పిల్లల ఫోటో తీసుకుంటారు, ఇక ఎలాంటి డాక్యుమెంట్లు అడగరు, అంతేకాదు మీ పిల్లల బయో మెట్రిక్ కూడా తీసుకోరు.. ఇక తర్వాత వారి వయస్సు 5 ఏళ్లు దాటిన తర్వాత 15 ఏళ్ల లోపు ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్, ఫేషియల్ స్కాన్ చేయించాలి.

ఇక ఐదు నుంచి 15 ఏళ్ల లోపు ఈ బయో మెట్రిక్ చేయించే సమయంలో స్కూల్లో చేర్పిస్తారు కనుక, స్కూల్ ఐడీ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్ కాపీ జత చేయాలి. అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. మీ పిల్లల వయస్సు 15 ఏళ్లు దాటిన తర్వాత కొత్త ఆధార్ కార్డు కోసం మళ్లీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక చిన్న తనంలో తీసుకున్నాం కదా కొందరు మళ్లీ ఆధార్ అప్ డేట్ చేయించరు కాని కచ్చితంగా చేయించాలి, ఇలా 5 ఏళ్ల లోపు, ఐదు నుంచి 15 ఏళ్ల లోపు మరోసారి, 15 ఏళ్ల తర్వాత మరోసారి అప్ డేట్ చేయించుకోవాలి…5 ఏళ్ల లోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డ్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇక వారికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ పేరెంట్స్ మొబైల్ నెంబర్ కు వస్తాయి. ఐదేళ్ల తర్వాత ఈ బ్లూ కలర్ ఆధార్ పని చేయదు, మళ్లీ అప్ డేట్ చేయించుకోవాలి.