చైనా, తైవాన్ల మధ్య ఓ విషయం గురించి వివాదం మొదలైంది.. అయితే ఏమిటి ఈ వివాదం అంటే..పైనాపిల్ పండ్ల కారణంగా చైనా, తైవాన్ల మధ్య తాజాగా వివాదం మొదలైంది….తైవాన్లో ఏటా 4,20,000 టన్నుల పైనాపిల్ పండ్లను అక్కడ రైతులు పండించి ఎగుమతి అమ్మకాలు చేస్తున్నారు…కాని ఇటీవల చైనా ఆ దేశం నుంచి వస్తున్న పైనాపిల్ పండ్లను వద్దు అంటోంది దిగుమతి చేసుకోవడం మానేసింది.
గత నెలలో తైవాన్ నుంచి పైనాపిల్ దిగుమతిని చైనా నిలిపివేసింది. ఈ పండ్లపై హానికారక క్రిములు ఉన్నట్లు గుర్తించామని,
అందుకే వద్దు అని తెలిపింది.. అయితే దీనిపై తైవాన్ ఫైర్ అవుతోంది.. చైనా చెబుతున్న క్రిములు కారణం కాదని, తమ దేశంపై రాజకీయ ఒత్తిడిని పెంచడానికే చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కామెంట్లు చేశారు.. అంతేకాదు ఈ పండ్లు తమ దేశంలో వారిని కొనుక్కోవాలి అని చెబుతోంది తైవాన్.
అంతేకాదు విదేశాల్లో కొత్త కస్టమర్లను వెతుక్కుంది. స్థానిక ప్రజలను ఇవి తినమని పిలుపుని ఇచ్చింది. ఇక్కడ నుంచి చాలా వరకూ పైనాపిల్స్ చైనాకు వెళతాయి.. కానీ చైనా ఆపేయడంతో ఇప్పుడు చాలా మంది రైతులు వ్యాపారులు ఇతర దేశాలకు పంపుతున్నారు. దీంతో ఇక్కడ పండ్ల రేటు తగ్గింది.