ఇటీవల అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి.. అలాగే అమ్మాయిలని ప్రేమించి మోసం చేస్తున్న వారు కూడా ఉంటున్నారు. ఇక ప్రియుడ్ని పెళ్లి చేసుకోను అన్నాడు అని అతనిని కూడా కడతేరుస్తున్నఅమ్మాయిలు ఉన్నారు, ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం, అయితే ఇప్పుడు జరిగిన ఓ ఘటన అందరిని షాక్ కి గురి చేసింది.
తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా కు చెందిన వ్యక్తి కాలేజీలో చదువుకునే రోజుల్లో జెస్సికా అనే యువతిని ప్రేమించాడు.
ఇద్దరు పార్కులు సినిమాలు అన్నీ తిరిగారు.. అయితే అతనికి విదేశాల్లో ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్లిపోయాడు, ఇక్కడ అక్కడ నుంచి ఆమెకి ఫోన్ లేదు టచ్ లో లేడు, ఇక ఇటీవల అతను ఇంటికి వచ్చాడు.. అతని కుటుంబ సభ్యులు చెప్పిన సంబంధం చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు.
కాని జెస్సికా మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలి అని కోరింది..కనీసం రెండో పెళ్లిగా అయినా తనను చేసుకోమని వేడుకుంది.
అయినా అతను నో అన్నాడు, చివరకు ఆమె ఓ స్కెచ్ వేసింది…కారులో ప్రియుడు బయటకు వెళ్తుండగా తన స్నేహితులతో కలిసి అతడి కారును వెంబడించింది. కారుపై పెట్రోల్ బాంబు విసిరి అక్కడి నుంచి పారిపోయింది. అతను వెంటనే తేరుకుని బయటకు వచ్చాడు.. ఇక కారు మాత్రం కాలి బూడిద అయింది. ఈ ఘటనతో పోలీసులకి ఫిర్యాదు చేశాడు ప్రియుడు.
|
|
|
నన్ను రెండో పెళ్లి అయినా చేసుకో ప్లీజ్ – నో చెప్పిన ప్రియుడు – చివరకు పెద్ద స్కెచ్ వేసింది
-