పీఎం కిసాన్‌ పథకం- భార్యాభర్తలిద్దరికి డబ్బులు వస్తాయా?..అసలు నిజాలివే..

PM Kisan scheme- Will both spouses get money..come? ..

0
93

చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. ప్రతి 4 నెలలకు రూ.2000 రైతు ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 9 విడతలుగా రైతు ఖాతాకు డబ్బులు చేరగా త్వరలో 10వ విడత రైతు ఖాతాలో జమ కానుంది.

మీరు పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులైతే ఇది మీకు శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే  భార్యాభర్తలు ఇద్దరు అప్లై చేసుకుంటే ఒక్కరికే డబ్బులు వస్తాయని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఈ స్కీం కింద భార్యాభర్తలిద్దరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇద్దరు ఈ పథకానికి అర్హులై ఉండాలి. అంటే ఇద్దరి పేరుపై సాగుభూమి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద రెండు హెక్టార్లు లేదా 5 ఎకరాల సాగు భూమి ఉన్న వారికి మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం హోల్డింగ్ పరిమితిని ఎత్తి వేసింది.

అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి చాలామంది బోగస్‌ రైతులు ఈ పథకం ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. ఈ అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాలను మార్పు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రధానమంత్రి రైతు సన్మాన పథకం ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులను తప్పనిసరి చేసింది.