అపార్ట్మెంట్లో ఇటీవల కొందరు ఫ్లాట్ అద్దెకు తీసుకుని సీక్రెట్ గా వ్యభిచార దందా సాగిస్తున్నారు, ఎవరికి అనుమానం రాకుండా బాగా పైన లేదా కింద ఫ్లోర్ లో అద్దెకు తీసుకుంటున్నారు… పక్కవారికి తెలియదు కదా అని అనుకుంటున్నారు.. ఇలా మూడు నాలుగు నెలలు అక్కడ ఉండి తర్వాత అక్కడ నుంచి దుకాణం మారుస్తున్నారు, అయితే పక్క వారికి అనుమానం వచ్చి పోలీసులకు చెబితే, వారు నిఘా వేస్తే ఇలాంటి ముఠాలు బయటపడుతున్నాయి తాజాగా అదే జరిగింది.
హైదరాబాద్ కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో చరణ్ రాజ్ అనే వ్యక్తి ఫ్లాట్ తీసుకుని అద్దెకు ఉంటున్నాడు. అక్కడకు అమ్మాయిలని తీసుకువచ్చి సీక్రెట్ గా వ్యభిచారం చేయిస్తున్నాడు, ఎవరికి తెలియకుండా కొంత కాలంగా ఇక్కడ ఈ దందా చేస్తున్నాడు, ఇక వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలు పంపుతున్నాడు, పక్కవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఇక్కడ ఆ ఇంటిపై దాడి చేశారు.. నిర్వాహకుడు చరణ్ రాజుతో పాటు ఇద్దరు విటులు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇటీవల ఈ ఫ్లాట్ కు చాలా మంది రావడంతో అక్కడ వారికి అనుమానం వచ్చి పోలీసులకి సమాచారం ఇచ్చారు, ఇలాంటివి ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు పోలీసులు.
|
|
అపార్ట్మెంట్లో సీక్రెట్ గా వ్యభిచారం పట్టుకున్న పోలీసులు – ఎక్కడంటే
-