ప్రియాంక గాంధీకి పోలీసులు జరిమానా

ప్రియాంక గాంధీకి పోలీసులు జరిమానా

0
98

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలపై రోజుకో వార్త వస్తోంది.. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీకి, ఆ పార్టీ నేత ధీరజ్ గుర్జార్కు యూపీ పోలీసులు రూ.6100 జరిమానా విధించారు, అయితే ఈ ఫైన్ దేనికి అనుకుంటున్నారా.
ద్విచక్ర వాహనంపై వెనక కూర్చుని హెల్మెట్ పెట్టుకోలేదు అందుకే ఈ ఫైన్ వేశారు

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో జరుగుతున్న ఆందోళనల్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దారాపురి అరెస్టయ్యారు. దీంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ప్రియాంక గాంధీ లక్నో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

అయితే పోలీసులకి తెలియకుండా వారికి కనిపించకుండా ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ధీరజ్ గుర్జార్తో కలిసి బైక్పై బయలుదేరారు ప్రియాంక గాంధీ , ఈ సమయంలో వారిరువురు హెల్మెట్ పెట్టుకోలేదు.. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీనిపై నెటిజన్లు కూడా వారికి ఫైన్ వేయరా అని ప్రశ్నించారు, దీంతో పోలీసులు వారికి ఫైన్ విధించారు.