పోలీసులు చేసిన ప‌నికి క‌న్నీళ్లు పెట్టిన డాక్ట‌ర్ ఎందుకంటే

పోలీసులు చేసిన ప‌నికి క‌న్నీళ్లు పెట్టిన డాక్ట‌ర్ ఎందుకంటే

0
149

మ‌న దేశంలోనే కాదు అన్నీ దేశాల్లో ఈ వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి.. ఇక దుబాయ్ లో కూడా ఇలాంటి ప‌రిస్దితి ఉంది, తాజాగా అక్క‌డ ప‌ని చేస్తున్న ఓ హైద‌రాబాదీ డాక్ట‌ర్ ఈ కోవిడ్ రోగుల‌కి వైద్యం అందిస్తోంది, రాత్రి 1 గంట స‌మ‌యంలో ఆమె విధులు ముగించుకుని ఇంటికి వెళుతోంది, ఈ స‌మ‌యంలో పోలీసులు ఆమె కారుని ఆపారు.

వెంట‌నే త‌న డాక్ట‌ర్ ఐడెంటిటీ కార్డ్, ప‌త్రాలు, అన్నీ చూపించింది, వెంట‌నే పోలీసులు ఆమెని చూసి సెల్యూట్ చేశారు, మీరు చేస్తున్న సేవ‌లు మ‌రువ‌లేనివి మేడం మీరు వెళ్లండి అని తెలిపారు, దీంతో ఆమె చాలా ఆనందించింది.. సంతోషంలో క‌న్నీరు తెచ్చుకుంది, పోలీసులు చేసిన చ‌ర్య‌కి క‌న్నీరు పెట్టుకుంది.

ఆమె ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో పంచుకుంది, దీనిపై పెద్ద పెద్ద పోలీస్ ఆఫీస‌ర్లు కూడా ఆమెని అభినందించారు, మీ లాంటి డాక్ట‌ర్లు బాగా సర్వీస్ చేస్తున్నారు అని ప్ర‌శంసించారు, అంతేకాదు ఆమె తండ్రికి కూడా ఫోన్ చేసి ఆయ‌న‌ని కూడా అభినందించారు. నిజంగా డాక్టర్లే ఇప్పుడు దేవుళ్లు అయ్యారు.