పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన కేసీఆర్

0
103

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ కమాండ్ కంట్రోల్‌ కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్‌ కేంద్రం అత్యాధునిక పరిజ్ఞానం కలిగి ఉంది. దీని ఏర్పాటుతో నగర కమిషనరేట్  పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్ ఫోర్స్, స్పెషల్  బ్రాంచ్ .. ఇలా అన్ని విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి చేరాయి.

కమాండ్ కంట్రోల్ కేంద్రంలో అన్ని శాఖల సమన్వయానికి ఏర్పాట్లు చేయగా..ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెర ఏర్పాటు చేశారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలు కానుంది.

కమాండ్ , కంట్రోల్ సెంటర్ లో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అని డిపార్ట్ మెంట్ల చీఫ్ లు ఒకే దగ్గర సమావేశమై నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ రాకతో సా.4.30 వరకూ బంజారాహిల్స్ వైపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగనుందని పోలీసులు తెలిపారు.