పోలీసులకు కీలక విషయం చెప్పిన డీజీపీ మహేందర్ రెడ్డి

పోలీసులకు కీలక విషయం చెప్పిన డీజీపీ మహేందర్ రెడ్డి

0
167

ఈ లాక్ డౌన్ సమయం నుంచి, రెస్ట్ లేకుండా లీవ్ లేకుండా వర్క్ చేస్తున్న వారిలో డాక్టర్లు పోలీసులు ఉన్నారు, ఎలాంటి సెలవులు వారికి లేవు పూర్తిగా డ్యూటీలోనే ఉన్నారు. ఇక ఫ్రంట్ లైన్ లో వర్క్ చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఇక మహరాష్ట్రలో అయితే పోలీసులకు చాలా మందికి వైరస్ సోకింది.

పలువురు మరణించారు కూడా.. అందుకే డ్యూటీల విషయంలో 50 ఏళ్లు దాటిన వారిని చాలా వరకూ స్టేషన్ డ్యూటీకి పరిమితం చేస్తున్నారు, తాజాగా తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసులు, అధికారులు విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.

విధుల్లో ఉన్న పోలీసులు, అధికారులు కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే సెలవు పెట్టాలన్నారు. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే వైరస్ ఇతరులకు సోకదని ఆయన చెప్పారు. పోలీసులు సెలవు అడిగిన వెంటనే యూనిట్ అధికారులు అనుమతి ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. దీంతో చాలా మంది పోలీసులు ఆనందంలో ఉన్నారు