బీజేపీ ఫైర్ బ్రాండ్ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. కారణం ఏంటంటే..అమ్నిషియా పబ్ రేప్ కేసులో మైనర్ బాలిక ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంపై తలితండ్రులు పిర్యాదు మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం పోలీసులు ఐపీసీ సెక్షన్ 228 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.