పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేత హల్ చల్…

పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేత హల్ చల్...

0
85

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేత హల్ చల్ చేశాడు… ఇటీవలే తనపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని ఆగ్రహం చెందాడు వైసీపీ నేత కాటమరాజు…

దీంతో ఆయన పోలీస్టేషన్ ఎదుట నిరసన చేశాడు… అర్థనగ్నంతో నిరసన చేశాడు… ఈ క్రమంలో పోలీసులు ఆయనకు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన వినలేదు… కాగా ఇటీవలే ఆయన ఓ పనిమీద బయటకు వెళ్లాడు ఆసమయంలో అతనిపై దాడి జరిగింది…

దీనిపై కాటమరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు… ఫిర్యాదు చేసినా కూడా వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీంతో ఆయన పోలీస్ట్ స్టేషన్ ఎదుట అర్థనగ్నంతో నిరసనకు దిగారు…