ముప్పుతిప్పలు పెట్టి చిరవకు పోలీస్ అధికారి ప్రాణంతీసుకున్న కారోనా మహమ్మారి

ముప్పుతిప్పలు పెట్టి చిరవకు పోలీస్ అధికారి ప్రాణంతీసుకున్న కారోనా మహమ్మారి

0
81

కరోనాతో చేస్తున్న యుద్దంలో ముందువరుసలో నిలుస్తున్న పోలీసులు వైద్యులు సిబ్బంది కరోనాకు బలవుతున్నారు… తాజాగా బంజారాహిల్స్ కు చెందిన ఏఎస్సై విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు..

వారం రోజుల క్రితం శ్వాసకోస సమస్యతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్దారణ అయింది… దీంతో అతడిని అపోలా ఆసుపత్రికి తరలించారు…వైద్యులు పోలీస్ అధికారికి నాలుగు రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించారు..

అనారోగ్య సమస్యలతో పాటు కరోనా తోడు కావడంతో తాజాగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు… ఏఎస్సై మృతిపట్ల అధికారులు సహాచరులు విచారం వ్యక్తం చేస్తున్నారు…