Flash: పోసాని కృష్ణ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు

0
76

టికెట్ల ధరలపై టాలీవుడ్‌ స్టార్‌ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో… టాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు. పెద్ద హీరోలయే సినిమాలు కాదని, చిన్న సినిమాలు లేకుంటే చిత్ర పరిశ్రమ ఇప్పుడు నాశనమయ్యేది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా బాగుంటే అందరూ చూస్తారని.. విశాఖలో సినీ పరిశ్రమ పెడితే తప్పు లేదని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ అంతా విశాఖ రావాలంటే సాధ్యం కాదని ఎక్కువ అని కుండబద్దలు కొట్టారు. అన్ని వర్గాల వారికి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని చెప్పారు పోసాని.